Balakrishna: ముందే గ్ర‌హిస్తే క్యాన్స‌ర్‌ను నివారించ‌వ‌చ్చు: బాల‌కృష్ణ

Balakrishna: నేడు వ‌ర‌ల్డ్ క్యాన్స‌ర్ డే సంద‌ర్భంగా.. బ‌స‌వ‌తారకం ఇండో అమెరికన్ క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో క్యాన్స‌ర్ దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే, న‌ట‌సింహం బాల‌కృష్ణ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. క‌రోనా ప‌రిస్థితుల వ‌ల్ల క్యాన్స‌ర్ దినోత్స‌వాన్ని సాదాసీదాగా జ‌రుపుతున్నామ‌న్నారు. అలాగే క్యాన్స‌ర్ తొలి ద‌శ‌లోనే గుర్తించ‌గ‌లిగితే దాన్నుంచి బ‌య‌ట ప‌డ అవ‌కాశం ఉంటుంద‌ని Balakrishna బాల‌య్య అన్నారు.

Balakrishna

చెడు అల‌వాట్ల‌కు దూరంగా ఉండాల‌ని ముఖ్యంగా యువ‌త చెడు అల‌వాట్లకు దూరంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా, శ్ర‌ద్ధ తీసుకునేందుకు ఈ క్యాన్స‌ర్ దినోత్స‌వం రోజున ప్ర‌తిజ్ఞ చేద్దామ‌ని పిలుపు నిచ్చారు. ఈ ఆసుప‌త్రిల్లో హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లు వారి ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప‌నిచేస్తున్నార‌ని Balakrishna బాల‌కృష్ణ పేర్కొన్నారు.