రూలర్, జడ్జిమెంట్, డిపార్ట్మెంట్… పేర్లన్నీ బాలయ్య సినిమాకే

బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో జై సింహా కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఒక సినిమా రాబోతోంది. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్స్ నందమూరి అభిమానులకి కొత్త జోష్ ఇచ్చింది. బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తున్న ఈ సినిమాకి టైటిల్ మాత్రం ఫిక్స్ చేయలేదు. ముందుగా ఈ సినిమాకి ఎన్టీఆర్ దమ్ము చిత్రంలోని పాట నుంచి రూలర్ అనే టైటిల్ పెట్టాలి అనుకున్నారు. అయితే రూలర్ కన్నా వేరే టైటిల్ ఫిక్స్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ అనుకుంటున్నారట.

రూలర్ కాకపోతే జడ్జిమెంట్ అని కానీ డిపార్ట్మెంట్ అని కానీ పెడితే బాగుంటుందని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. బాలయ్య రేంజుకి జడ్జిమెంట్ అయితే బాగుంటుందని అభిమానులు కూడా అనుకుంటున్నారు. అయితే పోలీస్ పాత్రకి సంబంధించిన కథ కూడా ఉండడంతో డిపార్ట్మెంట్ అనే టైటిల్ కూడా సరిపోతుందని కూడా ఫీల్ అవుతున్నారు. రూలర్, జడ్జిమెంట్, డిపార్ట్మెంట్ వినగానే మూడు పేర్లు బాగానే ఉన్నాయి. మరి చిత్ర యూనిట్ ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు అనేది చూడాలి.