Balayya: అభిమానుల‌కు బాల‌య్య గాడ్‌ఫాద‌ర్‌..

Balayya: నంద‌మూరి న‌ట‌సింహం న‌టిస్తున్న తాజా చిత్రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న విష‌యం తెలిసిందే. వీరిద్దరి కాంబినేష‌న్‌లో లెజెండ్‌, సింహా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న విజ‌యం సాధించాయి. దీంతో మ‌రోసారి వీరి కాంబో మూవీ వ‌స్తుందంటే బాల‌య్య అభిమానులు పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొనే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. ఈ నేప‌థ్యంలోనే ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాణంలో Balayyaబీబీ3 వ‌ర్కింగ్ టైటిల్‌తో వీరి కాంబో తెర‌కెక్కుతుంది.

Balakrishna

ఈ చిత్రానికి టైటిల్ విష‌యంలో ప‌లు పేర్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇప్పుడు తాజాగా గాడ్‌ఫాద‌ర్ అనే టైటిల్‌ను చిత్ర‌బృందం ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. క‌థ‌కు, Balayyaబాల‌య్య‌కు స‌రిగ్గా ఈ టైటిల్ సూట‌వుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఇక త్వ‌ర‌లో ఈ విష‌యంపై అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ జ‌న్మ‌దినం రోజు మే 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.