హీరోగా ఎంత క్రేజ్ తెచ్చుకున్న కూడా ఒక ప్రజా సేవకుడిగానే కొనసాగడానికె తాను ఎక్కువగా ఇష్టపడతాను అని నందమూరి బాలకృష్ణ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక ముఖ్యంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురం ప్రజలు అంటే అమితమైన ప్రేమ అని నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే ఇటీవల హిందూపురంలో కూడా కోవిడ్ బాధితుల సంఖ్య పేరుగుతోందని బాలకృష్ణ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
ఎప్పటికప్పుడు పరిస్థితుల గురించి తెలుసుకుంటూ సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల హిందూపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా పేషేంట్స్ కోసం సొంతంగా 25లక్షల రూపాయలతో రెండు వెంటిలేటర్స్ ని డొనేట్ చేశారు. ఇక బాలకృష్ణ నెక్స్ట్ బోయపాటి సినిమాతో రానున్న విషయ. తెలిసిందే. ఆ సినిమాకు మొదట మోనర్క్ అనే టైటిల్ ని అనుకున్నారు. కానీ ఇప్పుడు బొనాంజా అనే టైటిల్ పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.