Tollywood: ద‌స‌రాకు రాబోతున్న క్రాక్ డైరెక్ట‌ర్‌- బాల‌య్య కాంబో మూవీ..

Tollywood: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో బీబీ3 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన లెజెండ్‌, సింహ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న‌విజ‌యం సాధించాయి. దీంతో వీరి కాంబోలో మూవీ వ‌స్తుందంటే ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తి నెల‌కొంటాయి. ఇక ఈ చిత్రానికి మోనార్క్‌, గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.

Tollywoodఈ చిత్రాన్ని భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తుండ‌గా.. మే 28న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించారు. కాగా ఈ సినిమా అనంత‌రం బాల‌య్య.. క్రాక్ విజ‌యంతో ఫుల్ జోష్ మీదున్న డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రారంభం కాక‌ముందే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై వార్తాలు వెలువ‌డుతున్నాయి. Tollywoodఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని Tollywoodచిత్ర‌బృందం ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ట‌. గ‌తంలో బాల‌య్య చిత్రాలు ద‌స‌రా కానుక‌గా విడుద‌లై మంచి విజ‌యాలు ద‌క్కాయి.