రిజల్ట్ రిపీట్ అవుద్ది… #NBK106

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్ అంటే నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ మాస్ కాంబినేషన్ లో సింహా, లెజెండ్‌ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ వచ్చాయి. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న సమయంలో ఈ కాంబినేషన్ లో మూడో సినిమా అనౌన్స్ అయ్యింది. మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ బయోపిక్ అయిపోగానే ఎన్.బీ.కే ప్రొడక్షన్స్ లోనే ఈ మూవీ కూడా వస్తుంది అనుకున్నారు కానీ ఇంతలో కేఎస్ రవికుమార్ లైన్ లోకి వచ్చాడు. ఇక బాలయ్య బోయపాటి కలయికలో సినిమా ఆగిపోయిందా అనుకుంటున్న టైములో నందమూరి అభిమానులని సంతోష పెట్టే వార్త బయటకి వచ్చింది.

గత రెండు సినిమాలని మించే స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్ర‌స్తుతం స‌మాజంలోని ప్ర‌ధాన‌మైన స‌మ‌స్యని కథగా చేసుకుని బోయ‌పాటి శ్రీను, బాలయ్య కోసం అద్భుత‌మైన క‌థ‌ను సిద్ధం చేశారు. డిసెంబ‌ర్ నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2020 సమ్మర్ లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇది వ‌ర‌కు బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాల్లో బాల‌కృష్ణ‌ ప‌వ‌ర్‌ఫుల్ లుక్స్, డైలాగ్స్, ఫైట్స్ అంద‌రినీ మెప్పించాయి. సింపుల్ గా చెప్పాలి అంటే గత పదేళ్లలో బాలకృష్ణని బోయపాటి చూపించినట్లు ఎవరూ చూపించలేదు. లెజెండ్ ని మించేలా మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో బాల‌కృష్ణ చూపించ‌డానికి డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను రెడీ అయ్యారు. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ‌క్ష‌న్ నెం.3గా నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వివ‌రాల‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించనున్నారు.