హర్షివ్ కార్తీక్ ‘బహుముఖం’ ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్‌లోని న్యూ ఏజ్  ఫిల్మ్ మేకర్స్ డిఫరెంట్ జోనర్స్ ఫిల్మ్ మేకింగ్‌లతో ప్రయోగాలు చేస్తున్నారు. తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమౌతున్నారు ట్యాలెంటెడ్ హర్షివ్ కార్తీక్. ఆసక్తికరమైన విషయంఏమిటంటే, తను ప్రధాన పాత్ర పోషించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహిస్తున్నారు.

Swarnima Singh

స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా ఈ చిత్రంలో కథానాయికలు. క్రిస్టల్ మౌంటైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి అరవింద్ రెడ్డి సహ నిర్మాత. ల్యూక్ ఫ్లెచర్ సినిమాటోగ్రాఫర్ కాగా, శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. రామస్వామి, హర్షివ్ కార్తీక్ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతం సమకూరుస్తున్నారు. హర్షివ్ కార్తీక్, గ్యారీ బిహెచ్‌తో పాటు ఎడిటింగ్ కూడా నిర్వహిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘బహుముఖం’ అనే టైటిల్ పెట్టారు. గుడ్, బ్యాడ్ & యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్, జార్జియా, యుఎస్ఏ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించబడింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హర్షివ్ కార్తీక్ కాంప్లెక్స్ క్యారెక్టర్ కనిపిస్తున్నారు. ముఖంలో ఒక వైపు నుదుటిపై విభూతితో నీలం రంగు వేయబడి ఉండగా, మరొక వైపు అతనిని స్టైలిష్ అవతార్‌లో చూపిస్తుంది. కంటి నుండి కన్నీళ్లు కారుతుంటే, మరోవైపు ఆనందం కనిపిస్తోంది. అతని చేతులు లాక్ చేయబడ్డాయి. ఈ పోస్టర్ పాత్ర యొక్క విలక్షణ స్వభావాన్ని చూపిస్తుంది.

‘బహుముఖం’ త్వరలోనే థియేటర్స్ లో విడుదల కానుంది.

తారాగణం: హర్షివ్ కార్తీక్, స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా

సాంకేతిక విభాగం:
రచన-డిజైన్-నిర్మాణం-దర్శకత్వం: హర్షివ్ కార్తీక్
డీవోపీ: ల్యూక్ ఫ్లెచర్
సంగీతం: ఫణి కళ్యాణ్
ఎడిటింగ్: గ్యారీ బిహెచ్, హర్షివ్ కార్తీక్
పీఆర్వో: వంశీ-శేఖర్