సాంగ్ బాగుంది, సినిమా కూడా బాగుంటే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు

యంగ్ హీరో నితిన్, నభ నటేష్ జంటగా నటిస్తున్న సినిమా మ్యాస్ట్రో. హిందీ హిట్ మూవీ అంధాదున్ కి రీమేక్ గా రానున్న ఈ సినిమాకి మేర్ల‌పాక గాంధీద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పియానో ప్లేయ‌ర్‌గా నితిన్ క‌నిపించ‌నున్న ఈ సినిమా ఒటిటిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఇస్తున్న మ్యాస్ట్రో సినిమా నుంచి బేబీ సాంగ్ రిలీజ్ అయ్యింది. మహతి ట్యూన్ కి అనురాగ్ వాయిస్ బాగా ఎస్సెట్ అయ్యింది. శ్రీజో రాసిన లిరిక్స్ చాలా క్యాచిగా ఉన్నాయి. రంగ్ దే మూవీతో హిట్ అందుకున్న నితిన్, ఎ నతిఒన అవార్డు సినిమాని తెలుగులో చేసి సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మేర్లపాక గాంధీ కూడా మ్యాస్ట్రో తన కంబాక్ సినిమా అవుతుందని భావిస్తున్నాడు. నభ నటేష్ గ్లామర్ మ్యాస్ట్రో మూవీకి ఎక్స్ట్రా ఎస్సెట్ అవనుంది. ఒక కూల్ బ్రీజ్ లాంటి సాంగ్ ని వినాలి అనుకున్న వాళ్లు బేబీ ఒహ్ బేబీ పాటని ఒకసారి వినేయండి.