అట్రాక్ట్ చేస్తున్న సినిమా బండిలోని బావిలోని కప్ప…

బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్, డికేల మద్దతుతో రిలీజ్ అవునా తెలుగు మూవీ సినిమా బండి. విలేజ్ సినిమా చేయడానికి ప్రయత్నించే కొద్దిమంది గ్రామస్తుల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాగా, తరుణ్ భాస్కర్ పాడిన ప్రమోషనల్ సాంగ్ మంచి హైప్ తెచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి బావిలోని కప్ప సాంగ్ సాంగ్ బయటకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శిరీష్ సత్యవోలు స్వయంగా పాడిన ఈ పాట చాలా క్యాచీగా ఉంది. మంచి బజ్ చేయడంలో సక్సస్ అయిన మేకర్స్, ఈ సినిమాని బండి మే 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది.