Bollywood: బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ తాజా చిత్ర లుక్‌..

Bollywood: బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు ఉంది. ఆయుష్మాన్ న‌టించిన విక్కీడోన‌ర్ నుంచి మొద‌లుకుని ప‌లు విభిన్న‌మైన చిత్రాలు వ‌ర‌కు ఆయ‌న‌కు ఎంతోగానో పేరు తెచ్చిపెట్టాయి. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్ త‌క్కువ స‌మ‌యంలోనే మంచి విజ‌యాలు అందుకున్నాడు. బడాయి హో, ఆర్టిక‌ల్ 15, అంధాధున్ చిత్రాల ద్వారా మ‌రింత క్రేజ్‌ను సంపాదించుకున్నాడు ఆయుష్మాన్‌Bollywood.

అలాగే ఆయుష్మాన్ చిత్రాలు చూసుకుంటే చాలా విభిన్నంగా ఉంటాయి. ఏది చేసినా విల‌క్ష‌ణంగా వైవిధ్యంగా చేయ‌టం అల‌వాటు.. Bollywood అయితే తాజాగా ఆయ‌న న‌టిస్తున్న‌ చిత్రం అనేక్. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనుభ‌వ్ సిన్హా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతుండ‌గా.. ఈ చిత్రంలో నుంచి ఆయుష్మాన్ లుక్‌ను రిలీజ్ చేశారు. స్వ‌యంగా ఆయుష్మాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట్ చేస్తూ.. అనుభ‌వ్ స‌ర్‌తో మ‌రో సినిమా చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. నా లుక్ ఇదిగో అంటూ పెట్టారు. ఇక Bollywood ఈ చిత్రాన్ని టి. సిరీస్ భూష‌ణ్ కుమార్‌, అనుభ‌వ్ సిన్హా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.