Tollywood: నూటొక్క జిల్లాల అంద‌గాడి సాంగ్‌ను చూశారా..

Tollywood: ఆర్టిస్ట్ క‌మ్‌, డైరెక్ట‌ర్ క‌మ్ అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో 101జిల్లాల అందగాడు చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రుహ‌నీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో.. దిల్‌రాజు, క్రిష్ జాగ‌ర్ల‌మూడి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై శిరీష్‌, వై. రాజీవ్ రెడ్డి,

Avasarala

జె. సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అవ‌స‌రాల బ‌ట్ట‌త‌ల‌గా క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను త‌న వైపు తిప్పుకున్నాడు.. తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ స్వ‌రాలు అందించ‌గా.. సింగ‌ర్ సింహా ఆ సాంగ్‌ను ఆల‌పించారు. ఇక ఈ చిత్రం మే 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.