Tollywood: బ‌ట్ట‌త‌ల‌తో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌..

Tollywood: టాలీవుడ్ న‌టుడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్ అష్టాచ‌మ్మాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నాడు అవ‌స‌రాల‌. అలాగే ఊహాలు గుస‌గుస‌లాడే చిత్రంతో డైరెక్ట‌ర్ అవ‌తార‌మెత్తాడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌. కాగా ఇప్పుడు ఆయ‌న ప్ర‌స్తుతం నూటొక్క జిల్లాల అంద‌గాడు చిత్రంలో న‌టిస్తున్నాడు. దిల్ రాజు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా ఇటీవ‌లే అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌కు సంబంధించిన బ‌ట్ట‌త‌ల వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.

Avasarala srinivas

ఇది కేవ‌లం ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్ భాగంగా వెరైటీగా ప్లాన్ చేశారని స‌మాచారం. అయితే తాజాగా ఈ Tollywood చిత్రంకు సంబంధించి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. చేతిలో టాయ్ ప‌ట్టుకుని ఓ వైపు విగ్గు పెట్టుకుని, మ‌రోవైపు వెంట్రుక‌లు ఉన్న అవ‌సరాల శ్రీ‌నివాస్ క‌నిపిస్తారు. ఈ పోస్ట‌ర్‌లో త్వ‌ర‌లో ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రానికి రాచ‌కొండ విద్యాసాగ‌ర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతుండ‌గా.. మే 7న ఈTollywood చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.