
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ , సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్ టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ క్రియేటివ్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని అలరించారు. షూటింగ్ ని లైవ్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. షూటింగ్ ని లైవ్ లో ఇవ్వడం ఇదే తొలిసారి. లైవ్ షూటింగ్ ద్వారా సినీ ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని అందించారు మజాకా మేకర్స్.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇంతదూరం వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేము క్రియేటివ్ గా ప్రమోషన్స్ చేయాలని భావించాం. కానీ ఇంత ఎండలో చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడకి వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్ యూ. ఇది ఫస్ట్ ఎవర్ లైవ్ షూట్ ప్రెస్ మీట్ అని చెబుతుంటే నాకు చాలా సర్ ప్రైజ్ గా అనిపించింది. చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇది. వన్ మంత్ గా డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. ఫెబ్రవరి 26న పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి’అన్నారు.
హీరోయిన్ రీతువర్మ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. ఇంత దూరం ప్రయాణం చేసిన వచ్చిన మీడియాకి థాంక్ యూ. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ గారు, టీం అంతా చాలా సపోర్ట్ చేశారు. సందీప్ లవ్లీ కో స్టార్. సాంగ్స్ ని ఆడియన్స్ థియేటర్స్ లో చాలాఎంజాయ్ చేస్తారు. మజాకాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను. థాంక్ యూ ‘అన్నారు
దర్శకుడు త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. మజాకాలో ఇది సెకండ్ మాస్ సాంగ్. మూడు రోజుల క్రితం భారీ సెట్ లో ఓ సాంగ్ చిత్రీకరించాం. సందీప్ కిషన్, రీతూ వర్మ ఇరగదీశారు. దాదాపు డెబ్బైమంది డ్యాన్సర్స్ తో భారీ సెట్స్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ అద్భుతంగా షూట్ చేశాం. ఇప్పుడు కంప్లీట్ అవుట్ డోర్ లో చేస్తున్న రావులమ్మ ఇంకో మాస్ సాంగ్. ఫుల్ ఫోక్ సాంగ్. థియేటర్స్ లో దద్దరిల్లిపోతుంది. ఈసారి మళ్ళీ సీట్లు లేస్తాయి. ఇది ఫిక్స్. సినిమా రీరికార్డింగ్ చూసేశాను. ఎక్స్ లెంట్ గా వుంది. సందీప్ కిషన్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. మామూలుగా వుండదు ‘అన్నారు.



నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఇది ఫస్ట్ టైం ఎవర్ లైవ్ షూట్. సినిమా కోసం అందరూ కష్టపడ్డారు. గత 25 రోజులుగా డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఎంతో ఉత్సాహంతో మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి ధన్యవాదాలు. మా సినిమాకి మీ సపోర్ట్ చాలా అవసరం. మా ప్రివియస్ మూవీకి చాలా సపోర్ట్ చేశారు. అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా కుదిరిన సినిమా మజాకా. ఈసారి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’అన్నారు.
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. మీడియాకి థాంక్ యూ. న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి దాక సినిమా కోసం టీం అంతా నాన్ స్టాప్ గా కష్టపడ్డారు. చాలా మంచి సినిమా తీశాం. మా బ్యానర్ లో బెస్ట్ సినిమా తీశామని నమ్ముతున్నాను. మా టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ’ అన్నారు.
రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ..ఇంత ఎండలో జర్నీ చేసి కెమరాలతో కొండక్కి ఇక్కడి వరకూ వచ్చి లైవ్ ఇస్తున్న మీడియా స్పెషల్ థాంక్స్. చివరి రోజు లైవ్ ఇచ్చాం. మజాకా శివరాత్రికి వస్తుంది. ఈ శివరాత్రి మజాకాతో సెలబ్రేట్ చేసుకుంటారని నమ్ముతున్నాను’అన్నారు.
తారాగణం: సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాతలు: రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
సంగీతం: లియోన్ జేమ్స్
డీవోపీ: నిజార్ షఫీ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
స్టంట్స్: పృధ్వీ
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా