Bollywood: యాక్ష‌న్ స్టార్ హీరో చిత్ర షూటింగ్‌లో స్థానికులు వాగ్వివాదం..

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్ర‌హాం ప‌లు చిత్రాల్లో న‌టించి యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ఎటాక్. ఇందులో జాన్ అబ్ర‌హం జోడీగా ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది .. ఈ చిత్రానికి ల‌క్ష్య‌రాజ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ధీర‌జ్ వాద్వ‌న్‌, అజ‌య్ క‌పూర్‌, జాన్అబ్ర‌హాం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ధ‌నిపూర్‌లో ప్రారంభ‌మైంది.

జాన్ అబ్ర‌హంపై ప‌లు యాక్ష‌న్ స‌న్నివేశాలు, బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో Bollywoodఈ సినిమా షూటింగ్ గురించి తెలుసుకున్న స్థానికులు భారీ ఎత్తున లొకేష‌న్‌కు చేరుకున్నారు. జాన్ అబ్ర‌హం ను చూడ‌డానికి అత్యుత్స‌హం ప్ర‌ద‌ర్శించారు. దీంతో భ‌ద్ర‌తా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లొకేష‌న్‌లోకి రాళ్లు కూడా రువ్వారు. దీంతో ప‌లువురు సెక్యూరిటీ సిబ్బందికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదంలో జాన్ అబ్ర‌హంకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇక ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు Bollywoodచిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.