‘అశ్వథ్థామ’గా యాక్షన్ మోడ్ లోకి దిగిన నాగ శౌర్య

గత 48 గంటలుగా ప్రియాంక రెడ్డి రేప్ కేసు తెలంగాణని, తెలుగు ప్రజలని కదిలిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకూ ఇదే ఇష్యూపై మాట్లాడుతున్నారు. టాలీవుడ్ లో కూడా ఇలాంటి సీరియస్ గర్ల్ ఇష్యూపై సినిమాలు వస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా, ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా డిస్కస్ చేసింది. ఇప్పుడు యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఇలాంటి టాపిక్ పైనే సినిమా చేసి ‘అశ్వథ్థామ’గా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. వైజాగ్ నేపథ్యంలో, రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్న అమ్మయిని కొందరు కిడ్నప్ చేస్తారు. ఈ అమ్మాయి కోసం ఒక వ్యక్తి ఫైట్ చేస్తాడు, అతనే అశ్వథ్థామ. స్వయంగా తానే స్టోరీ రాసిన నాగ శౌర్య, తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకున్నాడు. ఇంతకీ ‘అశ్వథ్థామ’ ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాడు? ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.