దేవరకొండకి ఘట్టమనేని హీరో సాలిడ్ చెక్…

గట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ కొడుకు, గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని మహేశ్ బాబు లాంచ్ చేశాడు. హీరో అనే పేరు ఫిక్స్ చేసి రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా అశోక్ స్క్రీన్ ప్రేజెన్స్ కి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం కాస్త అప్సెట్ అయ్యారు. దానికి కారణం విజయ్ గతంలో హీరో అనే టైటిల్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడమే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ కి హీరో అనే టైటిల్ ఫిక్స్ చేసి ఆనంద్ అన్నామలై అనే డెబ్యు డైరెక్టర్ కి భాద్యతలు కూడా అప్పగించారు. ఏం అయ్యిందో తెలియదు కానీ విజయ్ దేవరకొండ హీరో ప్రాజెక్ట్ గురించి ఒక్క వార్త కూడా వినిపించట్లేదు. ఇలాంటి టైములో అశోక్ గల్లా తన సినిమాకి హీరో అనే టైటిల్ అనౌన్స్ చేయడంతో ఇప్పుడు విజయ్ కొత్త టైటిల్ వెత్తుకోవాల్సిన అవసరం వచ్చింది.