Arya: ఒక మ‌నిషి ఆత్మ టెడ్డీబేర్‌లో చేరి మాఫియాపై పోరాడితే ఎట్లాంటుంది..

Arya: కోలీవుడ్ స్టార్ ఆర్య న‌టించిన తాజా త‌మిళ్‌ చిత్రం టెడ్డీ. ఈ చిత్రానికి శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. స్టూడియో గ్రీన్ ప‌తాకంపై కె.జ్ఞాన‌వేల్ రాజా, ఆధ‌నా జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధింది పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక Aryaఆర్య త‌మిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపే ఉంది. దీంతో ప్రేక్ష‌కులు ఆర్య సినిమా కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

Arya Movie

ఇప్పుడు ఈ ట్రైల‌ర్ ఎంతో ఆక‌ట్టుకుంటుంది. మాఫియాల‌పై హీరోలు పోరాడ‌డం సాధార‌ణ విష‌య‌మే కానీ.. ఓ టెడ్డీబేర్ ఈ విష‌యంలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంద‌న‌డం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. ఒక మ‌నిషి మ‌ర‌ణించిన త‌ర్వాత ఆత్మ టెడ్డీ బేర్‌లో చేరి మెడిక‌ల్ మాఫియాపై Aryaహీరోతో పాటు పోరాటం చేస్తోంది.. మొత్తానికి ఈ ట్రైల‌ర్ చూస్తుంటే ఇదొక ప్ర‌యోగాత్మ‌క మూవీ అన్న‌ట్లు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో Aryaఆర్య స‌ర‌స‌న స‌యేషా సైగ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మార్చి 12న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్స్‌లో ఈ చిత్రం ప్ర‌సారం కాబోతుంది.‌