‘ఆర్య-2’ రీరిలీజ్‌

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌.. ఇదొక సన్సేషనల్‌ కాంబో.. పుష్ప, పుష్ప-2  ఈ చిత్రాల తరువాత ఈ కాంబినేషన్‌  పవర్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. పుష్ప-2 చిత్రంతో వసూళ్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఈ క్రేజీ కాంబో.. తొలి సినిమా

ఆర్య’ వంటి విభిన్న ప్రేమకథా చిత్రం తరువాత రూపొందిన రెండో చిత్రం ‘ఆర్య-2’. ఆర్యకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సన్సేషనల్‌గా నిలిచింది. 2009లో విడుదలైన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ పర్‌ఫార్మెన్స్‌,  దేవి శ్రీప్రసాద్‌  సన్సేషనల్‌ మ్యూజిక్‌, సుకుమార్‌ బ్రిలియంట్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌కు, ఐకాన్‌ స్టార్‌ అభిమానులకు వన్‌ఆఫ్‌ దఫేవరేట్‌ చిత్రంగా నిలిచింది. అయితే గత కొంతకాలంగా రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో ఆర్య-2 చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఆర్య-2 రిరీలీజ్‌ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఎంతో కిక్‌ ఇచ్చే వార్త. సో.. ఏప్రిల్‌ 5న ఆర్య-2 రిరీలీజ్‌ కోసం అందరూ సిద్దమవుతున్నారు. ఆదిత్య ఆర్ట్స్‌ పతాకంపై బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ఆదిత్యబాబు నిర్మించిన ఈ చిత్రంలో నవదీప్‌, కాజల్‌ అగర్వాల్‌ ఇతర ముఖ్య తారాగణంగా నటించారు. 2009లో విడుదలైన ఆర్య-2 అంటే దాదాపు 15 సంవత్సరాలు తరువాత మళ్లీ వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రానుంది.–