


మంచు లక్ష్మీ ఆధ్వర్యంలో జరిగే టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో యంగ్ హీరో అరవింద్ కృష్ణ మెప్పించారు. నొవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ అండ్ HICCలో జరిగిన లక్ష్మీ మంచు టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షోలో అరవింద్ కృష్ణ అందరి దృష్టిని ఆకర్షించాడు. అరవింద్ కృష్ణ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ అందరిని మంత్రముగ్ధులను చేశారు. అద్భుతమైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించారు.
ర్యాంప్‌పై అరవింద్ వాక్‌తో అదరగొట్టేశారు. ప్రతి అడుగులో ఫ్యాషన్, దాతృత్వం గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. అరవింద్ కృష్ణ రాకతో స్టార్-స్టడెడ్ సాయంత్రంకి అదనపు స్పార్క్‌ను జోడించినట్టు అయింది. ప్రస్తుతం అరవింద్ కృష్ణ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.