అమీషా పటేల్ పై రాంచి కోర్టులో కేసు… అరెస్ట్ వారెంట్

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన బాగా బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న అమీషా పటేల్ పై రాంచీ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. బాలీవుడ్ నిర్మాత అజయ్ కుమార్, అమీషా పటేల్ మీద మోసం చేసిందని రాంచి కోర్ట్ లో కేసు వేశాడు. దేశీ మ్యాజిక్ అనే సినిమా నిర్మించడానికి అమీషా పటేల్ 2.5 కోట్లు అప్పుగా తీసుకుందని అజయ్ కుమార్ చెప్పాడు. దేశీ మ్యాజిక్ సినిమా చేయకపోవడంతో, తన డబ్బులు తిరిగి ఇవ్వమని అజయ్ కుమార్ అడిగితే అమీషా పటేల్ చెక్ ఇచ్చిందట.

అమీషా పటేల్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని ఆరోపించిన అజయ్ కుమార్, అమీషా పటేల్ ని మళ్లీ డబ్బులు ఇవ్వాలని కోరితే ఆమె తన మనుషులతో బెదిరించిందని ఆయన వాపోయాడు. దీంతో చేసేదేమి లేక అజయ్ కుమార్ రాంచి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించిన అమీషా పటేల్… అజయ్ కుమార్ తనను అప్రతిష్ఠపాలు చేయడానికే ఈ కేసు పెట్టారని ఆరోపించింది. ప్రజలలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి పేరు పొందాలని అజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపింది. దీనిపై నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పింది. అమీషా పటేల్ ఈ కేసు నుంచి ఎలా తప్పించుకుంటుందో చూడాలి.