నటుడు పృథ్వీరాజ్‌ పై అరెస్టు వారెంట్‌

’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ గా ప్రసింది చెందిన నటుడు పృథ్వీరాజ్ ఆనందరికి బాగా తెలిసిన వ్యక్తి. ఆయన అటు సినిమాలలోనే కాక ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కూడా బాగా కనిపిస్తూ ఉంటారు. ఆయన కొన్నాళ్ళు టీటీడీ చైర్మన్ గా కూడా పని చేసారు. ఇది ఇలా ఉండగా ఆయనకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి బుధవారం నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకావడం లేదని ఫ్యామిలీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.