పవన్ మూవీలో బాలీవుడ్ నటుడు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో దీని షూటింగ్ జరుగుతుండగా.. ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన పాత్ర ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. మొఘల్ రాజు ఔరంగజేబుగా అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడని సమాచారం.

ARJUN RAMPAL PAWAN MOVIE

జానపద పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందించనుండగా.. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.