బిగ్‌బాస్ నుంచి ఈ వారం అరియానా ఎలిమినేట్

ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. నామినేషన్స్‌లో అవినాష్, అఖిల్, మోనాల్, అరియానా ఉండగా.. అడిక్షన్ పాస్ వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు. దీంతో ఈ వారం నామినేషన్ ఉండదనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఉందని తెలిసిపోయింది. ఈ వారం అరియానా ఎలిమినేట్ అయింది. ఇప్పుడు హౌస్‌లో ఏడుగురు ఉండగా.. అరియానా ఎలిమినేట్ కావడంతో ఇక ఆరుగురు మాత్రమే ఉన్నారు.

ARIYANA ELIMINATE

వచ్చే వారం ఇంకోకరు ఎలిమినేట్ అయితే ఇక ఐదుగురు మాత్రమే ఉంటారు. ఆ ఐదుగురు ఫైనల్‌కి పోటీ పడనున్నారు. దీనిని బట్టి చూస్తే మరో మూడు వారాల్లో బిగ్‌బాస్-4 షో ముగియనుందని తెలుస్తోంది. అరియానా ఫైనల్స్ వరకు వెళుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి రానుంది.

హౌస్‌లో బోల్డ్‌గా మాట్లాడుతూ జెన్యూన్‌గా గేమ్ ఆడింది అరియానా.. ఆమె బోల్డ్‌గా మాట్లాడుతూ ఉండటంతో హౌస్‌లోకి ఎక్కవకాలం ఉండదని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అరియానా హౌస్‌లో ఉందంటే అది గ్రేటే.. మరికొద్దిరోజుల్లో షో ముగియనుండటంతో మరిన్ని ట్విస్ట్‌లు ఇచ్చేందుకు బిగ్‌బాస్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.