నన్ను బయటికి పంపించండి.. కన్నీళ్లు పెట్టుకున్న అరియానా

బిగ్‌బాస్‌ హౌస్‌లో తాను ఉండలేనని, తనను బయటికి పంపించండి అంటూ కన్నీళ్లతో బిగ్‌బాస్‌ను అరియానా వేడుకుంది. హౌస్‌లో తనను ఎందుకు ఒంటరి చేస్తున్నారని బిగ్‌బాస్‌ను నిలదీసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనకు ఇక ఉండాలని అనిపించడం లేదని, కంటెస్టెంట్స్ ఎవరూ తనకు నచ్చడం లేదని అరియానా కన్నీళ్లు పెట్టుకుంది.

ariyana

‘మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు.. ఇంత మందిని సేఫ్ చేయలేను. మా ఇంటికెళ్లిపోతా.. మీకు పుణ్యం వస్తుంది.. నన్ను పంపించేయండి’ అంటూ బిగ్‌బాస్‌ను వేడుకుంది.

ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు హౌస్‌మెట్స్ అరియానాను నామినేట్ చేశారు. దీంతో హౌస్‌లోని మెజార్టీ కంటెస్టెంట్స్‌కు అరియానా నచ్చడం లేదని అర్థమవుతోంది. ఈ వారం ఎక్కువమంది నామినేట్ చేయడం, తనను హౌస్ నుంచి బయటకు పంపించండి అంటూ ఆమె బిగ్‌బాస్‌ను వేడుకోవడంతో ఈ వారం అరియానా ఎలిమినేట్ అవ్వనుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.