కలర్ ఫోటో నుంచి ఆకాశాన్ని తెచ్చిన మనోజ్

యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ స్థాయికి ఎదిగిన సుహాస్ చాందినీ చౌదరి కలిసి నటిస్తున్న సినిమా కలర్ ఫోటో. సునీల్ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ బయటకి వచ్చింది. అరెరే ఆకాశం అంటూ సాగిన ఈ సాంగ్ ని మంచు మనోజ్ లాంచ్ చేశాడు. కాల భైరవ మ్యూజిక్ ఈ సాంగ్ ని రిపీట్ మోడ్ లో వినిపించేలా చేసింది. అనురాగ్ కులకర్ణి, కాల భైరవ వాయిస్ ఈ సాంగ్ కి మెయిన్ ఎస్సెట్ అయ్యాయి. సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అక్టోబర్ 23న రిలీజ్ చేస్తున్నారు.