Rana: అర‌ణ్య మూవీ నుంచి ఎమోష‌న‌ల్‌ సాంగ్ రిలీజ్‌..

Rana: రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న అర‌ణ్య చిత్రం నుంచి ఎమోష‌న‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో.. ఇటీవలే ఈ Rana చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌, వెళ్లు వెళ్లు సాంగ్ రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ఇక తాజాగా హృద‌య‌విదార‌క‌మైన సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

Aranya Movie

హృద‌య‌మే జ్వ‌లించేనే.. ప్రాణ‌మే విడిచి పోయేనే అంటూ సాగే ఈ ఎమోష‌న‌ల్ సాంగ్‌కు శాంత‌ను మోయిత్ర స్వ‌రాలు స‌మ‌కుర్చారు. వ‌న‌మాలి ఈ సాంగ్‌కు లిరిక్స్ అందించ‌గా.. హ‌రి చ‌ర‌ణ్ ఈ గీతాన్ని ఆలపించారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియ పిల్గా వోంక‌ర్ త‌దిత‌రులు న‌టించిన చిత్రానికి ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ నిర్మిస్తుంది.