ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన కేసుకు సంబంధించి సింగర్-కంపోజర్ ఎఆర్ రెహమాన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసు ఇచ్చింది. రెహ్మాన్ తన ఛారిటబుల్ ట్రస్ట్, ఎఆర్ రెహమాన్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయలు అనుమతి లేకుండా ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ టి ఆర్ సెంథిల్ కుమార్ తెలిపిన దాన్ని బట్టి, రెహమా 2011-12 ఆర్థిక సంవత్సరంలో యుకె ఆధారిత టెలికం కంపెనీకి ప్రత్యేకమైన రింగ్టోన్లను కంపోజ్ చేసినందుకు రూ .3.47 కోట్ల ఆదాయాన్ని అందుకున్నారు.
అయితే ఈ ఒప్పందం మూడేళ్లపాటు కొనసాగింది, అక్కడ తన ఛారిటబుల్ ట్రస్ట్, ఎఆర్ రెహమాన్ ఫౌండేషన్‌కు నేరుగా చెల్లింపు చేయమని రెహమాన్ కంపెనీని కోరాడు. అయితే “పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రెహమాన్ అందుకోవాలి. పన్ను మినహాయింపు తరువాత, దానిని ట్రస్ట్‌కు బదిలీ చేయవచ్చు. కానీ రెహమాన్ పన్ను చెల్లించకుండా ఛారిటబుల్ ట్రస్ట్‌కు ఆదాయాన్ని డైరెక్ట్ గా తరలించడం కరెక్ట్ కాదు. మరి ఈ ఆరోపణలపై రెహమాన్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి