కరోనా కష్ట కాలంలో వివిధ వర్గాలకు అపోలో ఫౌండేషన్ అందించిన పలు సేవా కార్యక్రమాల గురించి అపోలో ఫౌండేషన్ సి ఎస్ ఆర్ వైస్ ఛైర్ పర్సన్ శ్రీమతి ఉపాసన కొణిదెల వివరించారు. కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. మరో రెండేళ్ళ పాటు అవసరమైన వారందరికీ తగిన సహాయ సహకారాలు అందించాలి. అపోలో ఫౌండేషన్ ముఖ్యంగా ఈ సంక్షోభకాలంలో నిర్విరామంగా శ్రమిస్తూ..ఎందరినో ఆదుకుంది. అపోలో ఫౌండేషన్ అరగొండ వికాస్ ట్రస్ట్ స్కిల్ సెంటర్ లో కరోనా వైరస్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ రెగ్యులర్ గా జీతాలు..అదనపు బోనస్ లు..డైలీ ఫుడ్ ఆ సంస్థలో పని చేస్తున్న మహిళలు అందరికీ అందించాం..అలాగే వారి కుటుంబాను కూడా ఆదుకున్నాం. ఈ ట్రస్ట్ ద్వారా దాదాపు రెండు లక్షల ఫేస్ మాస్క్ లు తయారు చేశాం.
చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలానికి చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రభుత్వోద్యోగులు 60వేలకి మందికి పైన మాస్క్ లు ఉచితంగా అందజేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అరగొండ వికాస్ ట్రస్ట్ స్కిల్ సెంటర్ ద్వారా 1,238 పి.పి.ఇ కిట్స్ ఇచ్చాం. అరగొండ పరిసరాల్లోని 45గ్రామాలకు చెందిన ప్రజలకు ఉచితంగా నిత్యవసరాలు..కూరగాయలు..వైద్యసహాయం అందజేశాం.
అరగొండ మండలంలోని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ సిబ్బందికి 3,000ఫేస్ మాస్క్ లు ఇచ్చాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ కి అనుబంధంగా అపోలో ఫౌండేషన్..ఆంధ్రప్రదేశ్..తెలంగాణా రాష్ట్రాలకు చెందిన నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్..అంబ్రాబార్ టైగర్ రిజర్వ్ ప్రాంతాలకు చెందిన 500మంది చెంచు తెగల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు అంజేయడం జరిగింది. కోవిడ్ రిలీఫ్ సపోర్టర్స్ దాదాపు 3000మంది ఉచితంగా హెల్త్ కిట్స్..నిత్యవసర వస్తువులు అందజేశారు. ప్రాజెక్ట్ స్టే లో భాగంగా ముంబయి..ఢిల్లీ..బెంగుళూరు ప్రాంతాల్లోని ఐసోలేషన్ సెంటర్లలో 3.009 బెడ్ డేస్ ఉచితంగా ఏర్పాటు చేశాం. కోవిడ్19 సేఫ్టీ మాన్యువల్ ఎంతో పరిశోధించి రూపొందించాం. బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్..తమిళనాడు..తెలంగాణా..కర్ణాటక..ఢిల్లీ ప్రాంతాల్లోని 123ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు 7,397 తిరిగి యూజ్ చేసుకునే ఫేస్ మాస్క్ లు అందజేశాం. అలాగే 138ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోని ముసలివారికి రెగ్యులర్ మెడికేషన్ తో పాటు 1,74,000జింక్ టాబ్లెట్లు ఉచితంగా అందజేశాం. రోగులకు మెడిసిన్స్ రాత్రింబవళ్ళు అందించడానికి అపోలో ఫార్మసీకి చెందిన దాదాపు 30వేల మంది ఉద్యోగులు నిర్విరామంగా శ్రమించారు. అలాగే వెయ్యికి పైన ఉన్న అపోలో క్లినిక్స్ లో 90వేల కోవిడ్ టెస్ట్ లు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్ లో ఇంతవరకు 30వేల మంది కరోనా రోగులకు వైద్యం చేశారు. 500పడకలు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. పదివేల మంది పైన పారామెడికల్ స్టాఫ్ కరోనా రోగులకు సేవ చేయడానికి శ్రమించారు. అలాగే 7అపోలో హాస్పిటల్స్ లో 17,500మంది కరోనా రోగులకు ఉచితంగా ట్రీట్ మెంట్ చేయడం జరిగింది. వెంటిలేటర్లు ఉపయోగించే విషయంలో లక్షమంది మెడికల్ ప్రాక్టీషనర్లుకి శిక్షణ ఇచ్చారు. 15మిలియన్ల ఫ్రీ రిస్క్ స్కాన్స్ చేశారు. 1మిలియన్ టెలికౌన్సిలింగ్..అపోలో టెలిహెల్త్ ద్వారా ఉచితంగా చేయడం జరిగింది. అపోలో హాస్పిటల్ గ్రూప్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాటల్లో చెప్పాలంటే ఈ తరం కోసం మాత్రమే చేస్తున్న యుద్ధం కాదు. వచ్చే తరాల శ్రేయస్సు కోసం చేస్తున్న యుద్ధం. ఈ దేశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికే అపోలో హాస్పిటల్స్ స్థాపించడం జరిగింది. మిషన్ పూర్తయ్యేంతవరకు విశ్రాంతి లేకుండా..అన్ని త్యాగాలకు సిద్ధపడి సేవలు అందించడానికి అపోలో సంసిద్ధంగా ఉంది.