మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఏపి సినిమాటోగ్రఫీ మినిస్టర్

ఆంధ్ర ప్రదేశ్ 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే. కాగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా జనసేన పార్టీ నుండి కందుల దుర్గేష్గారిని ఎన్నిక చేసారు. ఈరోజు ఉదయం కందుల దుర్గేష్ గారు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని విశ్వంభర సెట్స్ లో కలిసినట్లు చిరంజీవి గారు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిరంజీవి గారు తన X ద్వారా తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలిపారు.

“మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు!💐💐

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని
అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను! 💐💐”