హాలీవుడ్ సినిమాలన్నింటినీ గుర్తొచ్చేలా చేసారు

సినిమా చేతిలోకే వచ్చేస్తున్న కాలంలో మనలో చాలా మంది భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకి, అది కూడా థ్రిల్లర్ సినిమాకి, ఇంగ్లీష్ సిరీస్ లకి చాలా మంది ఫాన్స్ ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ల టేకింగ్ కి, స్టార్స్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతూ ఉంటాం. అబ్బా ఏం చేసార్రా, ఎలా తీశార్రా అనుకుంటూ వాళ్లని పొగుడుతూ ఉంటాం. సరిగ్గా అలాంటి సినిమానే, ఆ స్థాయి సినిమానే తెలుగులో కూడా రాబోతుంది అంటే నమ్ముతారా. అవును తెలుగులో హాలీవుడ్ రేంజ్ సినిమా రాబోతుంది, అదే హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న నిశ్శబ్దం. అనుష్క మాధవన్ అంజలి షాలిని పాండే మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీ టీజర్ నుంచే సినీ లవర్స్ ని అట్రాక్ట్ చేసింది. ఆ ఇంట్రెస్ట్ ని మరింత పెంచుతూ మేకర్స్ నిశ్శబ్దం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గాన్ గర్ల్, ఇన్విజిబుల్ మాన్, సెర్చింగ్, ది వార్నింగ్, రూమ్, అన్ ట్రేసబుల్, క్వైట్ ప్లేస్, హుష్… బెస్ట్ థ్రిల్లర్స్ ఇన్ హాలీవుడ్ అని టైప్ చేస్తే గూగుల్ ఇచ్చే ఆన్సర్ ఇది. థ్రిల్లర్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఈ సినిమాల స్థాయిలో నిశ్శబ్దం సినిమా ఉంటుందా అనే రేంజులో ట్రైలర్ ని కట్ చేశారు. ట్రైలర్ లో సినిమాకి నిర్మాత పెట్టిన ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది.

నిశ్శబ్దం ట్రైలర్ లో మ్యూజిక్, టేకింగ్, లీడ్ పెయిర్ యాక్టింగ్ అన్నీ టాప్ నాచ్ లో ఉన్నాయి. సినిమాలో నటిస్తున్న ఒక్కొక్కరి గురించి స్పెషల్ గా చెప్పడం కష్టమే కానీ అందరితో అంత మంచి ఔట్పుట్ తెచ్చుకున్న క్రెడిట్ మాత్రం డైరెక్టర్ హేమంత్ కే దక్కుతుంది. నిశ్శబ్దం కథా కథనాల గురించి ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి ఇప్పుడు మేము చెప్పట్లేదు కానీ అక్టోబర్ 2న నిశ్శబ్దం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యే వరకూ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంత మంచి సినిమా తీసి, మరికొన్ని రోజులు థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకూ వెయిట్ చేసి ఉంటే ఎక్కువ మంది ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ అయ్యేది. అవన్నీ మానిటరీ ఇష్యూస్ కాబట్టి ప్రస్తుతానికి నిశ్శబ్దం ఓటిటిలో చూసేయండి.