ప్రభాస్ తో వెడ్డింగ్ పిక్.. స్పందించిన అనుష్క!

టాలీవుడ్ రెబల్ స్టార్, లేడి సూపర్ స్టార్ అనుష్క శెట్టి కాంబినేషన్ పై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి కంటే ముందే ఈ జంటపై లవ్ రూమర్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. ముఖ్యంగా మిర్చి సినిమాతో ఈ జోడి బాగా దగ్గరైందని పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

ఇక చాలా సార్లు ఆ రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేసిన అనుష్క మరోసారి ఒక స్పెషల్ ఫొటోపై ట్విట్టర్ లో వివరణ ఇచ్చింది. మిర్చి సినిమా వెడ్డింగ్ సీన్ షూట్ చేస్తునప్పటి ఫోటో పోస్ట్ చేసిన ఒక అభిమాని అనుష్క స్పందన కోరగా ఆమె ఈ విధంగా స్పందించారు. నిజంగా అది అనుకోకుండా తీసిన ఒక నిజమైన క్యాండీడ్ పిక్. ఆ తరువాత మిర్చి సినిమా బ్యూటీఫుల్ పోస్టర్ గా మారింది. ఆ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. నిర్మాతలు ప్రమోద్, వంశీ, విక్కీలకు అది మొదటి సినిమా.. అంటూ అనుష్క తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.