రెండేళ్ల తర్వాత మళ్లీ మాయ చేసింది

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్కశెట్టిని థియేటర్స్ లో చూసి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. 2018 జనవరిలో వచ్చిన భాగమతి తర్వాత అనుష్క మరో సినిమా చేయలేదు. చాలా కాలంగా అనుష్క సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నిశ్శబ్దం ఫస్ట్ లుక్ పోస్టర్ థ్రిల్ చేసింది. అనుష్క 46వ సినిమాగా తెరకెక్కిన నిశ్శబ్దం, షూటింగ్ అంత ఫారిన్ లోనే జరుపుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న నిశ్శబ్దం సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సాక్షి అనే పాత్ర చేసిన అనుష్క, మూగ ఆర్టిస్ట్ గా కనిపించనుంది. ఫస్ట్ లుక్ లో అనుష్క చాలా సింపుల్ గా ఉంటూనే అందరినీ కళ్లతోనే మాయ చేసింది.

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిశ్శబ్దం సినిమాలో అనుష్కతో పాటు ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలినీ పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ కూడా గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు