Tollywood: న‌వీన్ పోలిశెట్టి- అనుష్క జంట‌గా రాబోతున్న చిత్రం..

Tollywood: ప్ర‌ముఖ హీరోయిన్ అనుష్క అంటే తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో అభిమానం ఉంటుంది. నాగార్జున న‌టించిన సూప‌ర్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ భామ ఎన్నో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. హైట్‌, అందం, ఫిట్ బాడీతో కుర్ర‌కారును పిచ్చేక్కించేంది. ఇక త‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేసింది. ఆమె న‌టించిన రుద్ర‌మ‌దేవి, అరుంధ‌తి, బాహుబ‌లి చిత్రాలు అనుష్క కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలుగా నిలిచిపోయాయి. అవి తెలుగు ఇండ‌స్ట్రీనే షేక్ చేసిన చిత్రాలు. వీటితో అనుష్క ప్ర‌పంచ‌స్థాయి న‌టిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అనుష్క అంటే ఇప్ప‌డు తెలియ‌ని వారుండ‌రు.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతుంది.

Anushka new movie

ఇక అనుష్క న‌టిస్తున్న తాజాTollywood చిత్రం.. రారా కృష్ణ‌య్య డైరెక్ట‌ర్ మ‌హేశ్ తెర‌కెక్కించే చిత్రంలో అనుష్క న‌టించ‌బోతున్న‌ర‌ట‌. న‌ల‌భై ఏళ్ల వ‌య‌సున్న అమ్మాయి.. పాతికేళ్ల కుర్రాడు ప్రేమించ‌డం అనేది ఈ చిత్ర‌క‌థ‌గా తెలుస్తోంది. ఇందులో యువ‌కుడి పాత్ర‌లో న‌వీన్ పోలిశెట్టి న‌టిస్తున్నార‌ని స‌మాచారం. న‌వీన్ ఏజేంట్ శ్రీ‌నివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్ప‌డు జాతి ర‌త్నాలు Tollywood సినిమాతో తెర‌పై న‌వ్వులు పూయించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.