Hyderabad: బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడితో లక్ష్మీప్ర‌స‌న్న‌..

Hyderabad: మంచు ల‌క్ష్మీప్ర‌స‌న్న అన‌గ‌న‌గా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. డైలాగ్‌కింగ్ మోహ‌న్‌బాబు న‌ట వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్న మంచు ల‌క్ష్మీ తొలి సినిమాతోనే త‌న టాలెంట్ నిరూపించుకుంది. తొలి సినిమాలో విల‌నిజం పండించి ఉత్త‌మ విల‌న్‌గా నంది అవార్డు సొంతం చేసుకుంది. బుల్లితెర‌పై కూడా త‌న హావా న‌డిపిస్తోంది.

anupam kher

టీవీ రంగంలో హోస్ట్‌గా, సినీ న‌టిగా రాణిస్తూనే నిర్మాత‌గా ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు… నిర్మిస్తున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు, న‌ట‌శిక్ష‌కుడు అనుప‌మ్ ఖేర్‌తో క‌లిసి మంచు ల‌క్ష్మీ ఫోటోలు దిగింది.. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. Hyderabadహైద‌రాబాద్‌లోని తాజ్ ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జ‌రిగిన యువ‌ర్ బెస్ట్ డే ఈజ్ టుడే పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో అనుప‌మ్‌తో క‌లిసి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మంచు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రు క‌లిసి ఫోటోలు క్లిక్ మ‌నిపించారు.