ఎట్టకేలకు అమ్మడుకి అక్కడ మంచి హిట్ పడింది

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన మ‌జ్ను సినిమాతో తెలుగు తెర‌కు ఎంట్రీ ఇచ్చిన ఎన్నారై భామ అను ఇమ్మానుయేల్‌. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన అజ్ఞాత‌వాసి సినిమాలో అవ‌కాశం కొట్టేసింది. దాంతో త‌ర్వాతి టాప్ హీరోయిన్ అనుయే అనుకున్నారంతా. గొపిచంద్ తో ఆక్సిజన్, బ‌న్నీతో నా పేరు సూర్య‌ సినిమాలో కూడా అవ‌కాశం వ‌చ్చింది. కథలు ఎంచుకోవడంలో ఫెయిల్ అవడంతో ఈ బ్యూటీ ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది.

anu bags hit

ఎంత ఫస్ట్ గా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ అందుకుందో, అంతే ఫస్ట్ గా వచ్చిన ఆఫర్స్ కూడా చేజారిపోవడంతో అనూ తెలుగు కెరీర్‌కి శుభం కార్డు పడినట్టే అని అంటున్నారు సినీ జనాలు. కోలీవుడ్ లో మాత్రం అను ఇమ్మానుయేల్ రీసెంట్ గా నమ్మ వీటు పుల్లై సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా అనుకి తమిళ్లో మంచి బ్రేక్ అయితే ఇచ్చింది. మరి అమ్మడు దాన్ని ఎలా కంటిన్యూ చేస్తుందో చూడాలి.