అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కి ధీటుగా నిలుస్తున్న తెలుగు ఓటీటీ ‘ఆహా’…

కరోనా కారణంగా థియేటర్స్ అన్నీ క్లోజ్ అవ్వడంతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులందరూ ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల మూవీస్ వరకూ అన్నీ ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోనే స్ట్రీమ్ అవుండడంతో డిజిటల్ ఆడియన్స్ తాకిడి పెరిగింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఈ డిజిటల్ మార్కెట్ ని చాలా రోజుల నుంచి శాసిస్తుంటే, మన నేటివిటీతో కొత్తగా వచ్చిన ఆహా ఓటీటీ సాలిడ్ కాంపిటీషన్ ఇస్తోంది.

కొత్త సినిమాలని, వెబ్ సిరీస్ లని స్ట్రీమ్ చేస్తున్న ఆహా, కొత్తగా ఇతర భాషల్లో సూపర్ హిట్ సినిమాలని కూడా తెలుగులో డబ్ చేసి మన ప్రేక్షకుల ముందుకి తెస్తోంది. మలయాళంలో క్రిటికల్లి అక్లయిమేడ్ మూవీ జల్లికట్టు ఈ లిస్ట్ లో చేరింది. ఆంటోని వర్గీస్ హీరోగా 4 కోట్ల బడ్జట్ తో తెరకెక్కి 20కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా, మల్లువుడ్ లో మంచి పేరుని తెచ్చుకుంది. క్రిటిక్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా మెప్పించిన జల్లికట్టు సినిమాని తెలుగులోకి డబ్ చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఆహా వీడియో వాళ్లు ట్వీట్ చేశారు.