రేవ్ పార్టీ కేసులో మరో మలుపు – నటి హేమకు….

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ కేసులో అరెస్టైన హేమకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. బెయిల్ లభించిన నేపథ్యంలో హేమ జైలు నుంచి బయటకు రానున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే మా అసోసియేషన్ నుండి ఆమె సభ్యత్వాన్ని కూడా ఈ కేసు తేలేవరకు తీసేసినట్లు సమాచారం. మొదట తనకి రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, నేను హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నాను అని ఆమె ఓ వీడియో ద్వారా అందరిని పక్క దారి పట్టించడానికి ప్రయత్నిచినప్పటికీ ఆ ట్రిక్ బిడిసికొట్టింది.