Tollywood: మ‌రోసారి బాల‌య్య‌కు పోటీగా ర‌వితేజ‌..

Tollywood: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, మాస్ మ‌హారాజ్ ర‌వితేజ్ మ‌రోసారి బ‌రిలోకి దిగ‌నున్నారు. 2008లో ర‌వితేజ న‌టించిన కృష్ణ‌, బాల‌కృష్ణ న‌టించిన ఒక్క‌మ‌గాడు సినిమాలు సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత బాల‌కృష్ణ మిత్రుడు, ర‌వితేజ కిక్ చిత్రాలు ‌వేస‌వి సీజ‌న్‌లో వారం గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. అలాగే ప‌ర‌మ‌వీర చక్ర‌తో బాల‌కృష్ణ‌.. మిర‌ప‌కాయ్ చిత్రంతో ర‌వితేజ బ‌రిలోకి దిగారు. అలాగే 2013లో మ‌ళ్లీ బాల‌య్య‌- ర‌వితేజ బాక్సాఫీస్ బ‌రిలో నిలిచారు.

balayya-raviteja

ఒకే స‌మ‌యంలో విడుద‌లైన ర‌వితేజ వీర‌, బాల‌కృష్ణ న‌టించింన శ్రీ‌రామ‌రాజ్యం సినిమాలు రెండు ప్రేక్ష‌కుల‌ను ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. Tollywood ఈ సినిమాలు బాల‌య్య‌కు పోటీగా వ‌చ్చి ర‌వితేజ బాక్స‌ఫీస్ వ‌ద్ద హిట్ కొట్టాడు. మ‌ళ్లీ ఇప్పుడు ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఇటీవ‌లే క్రాక్‌తో హిట్ కొట్టి మంచి జోష్ మీదున్నాడు ర‌వితేజ‌. ఖిలాడి చిత్రాన్ని రాక్ష‌సుడు ఫేం డైరెక్ట‌ర్ ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. Tollywood ఈ చిత్రాన్ని కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్ర‌బృందం. మే 28న ఖిలాడీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అదేవిధంగా న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ ఇచ్చిన డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను.. మ‌రోసారి బాల‌య్య‌తో క‌లిసి బీబీ3తో వ‌స్తున్నారు. ఈ సినిమాను ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తుండ‌గా.. నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్ర‌బృందం. బాల‌య్య బీబీ3 సినిమా మే 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీంతో ర‌వితేజ‌-ఖిలాడీ, బాల‌య్య‌-బీబీ3గా మ‌రోసారి వీరిద్ద‌రు బాక్సాఫీస్ వ‌ద్ద బరిలోకి దిగుతున్నారు.