ప్రభాస్ కోసం సిద్దమైన మరో పాన్ ఇండియా దర్శకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెల 23న తన 41వ పుట్టినరోజును సెలబ్రెట్ చేసుకోబోతున్నాడు. ఆ రోజు భారీ స్థాయిలో అప్డేట్స్ వెలువడనున్నట్లు అర్ధమవుతోంది. గత ఏడాది పుట్టినరోజుకు ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమి పెద్దగా రాలేదు. కానీ ఈ సారి ఎక్కువ అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రాధేశ్యామ్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ అక్కడే పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకొనున్నాడు. ఇక అదే రోజు మరో పాన్ ఇండియా దర్శకుడితో ఒక సినిమాను ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నట్లు గత కొంత కాలంగా ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే అక్టోబర్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.