చిత్ర సూసైడ్ కేసులో భారీ ట్విస్ట్

తమిళ బుల్లితెర నటి వీజే చిత్ర సూసైడ్ కేసు మలుపులు తిరుగుతోంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. ఇటీవలే ఈమె నిశ్చితార్థం పూర్తవ్వగా.. త్వరలో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో చిత్ర సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారాయి. ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనుక రీజన్ ఏంటనేది ఇంకా బయటపడలేదు. కానీ అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందే ఆమెకు పెళ్లి అయిందని రిజిస్ట్రర్ అధికారులు పోలీసులకు చెప్పారు.

chitra

ఈ ఏడాది అక్టోబర్ 19వ తేదీ చెన్నైలోని ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో పెళ్లి జరిగిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు, మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడిందని ప్రచారం జరుగుతోంది. చిన్న గత కొంతకాలంగా హెమంత్‌తోనే కలిసి ఉంటుందని, అతడితోనే వివాహం అయిందని వార్తలు వస్తున్నాయి. పెద్దల సమక్షంలో కూడా హేమంత్‌తోనే చిత్ర పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సమయంలో ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది అనేది పోలీసులకు అంతకుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే తన కూతురిది ఆత్మహత్య కాదని, హేమంత్‌ను విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని కుటుంబసభ్యులు కోరుతున్నారు. దీంతో నిన్నటి నుంచి హేమంత్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.