ఛీ.. ఛీ.. గుడిలో ముద్దులే ముద్దులు

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫ్లామ్ నెట్‌ఫ్లిక్స్ మరో వివాదంలో చిక్కుకుంది. ‘ఏ సూటబుల్ బాయ్’ అనే వెబ్‌సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. ఈ వెబ్‌సిరీస్‌లో ఒక ఆలయ ప్రాంగణంలో ముద్దు సీన్లు చూపించడం వివాదంగా మారింది. ఈ సన్నివేశాలను వెంటనే తొలగించాలని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సీన్ ఉందని భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ డిమాండ్ చేస్తున్నారు.

netflix

దీనిపై ఆయన మధ్యప్రదేశ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. లవ్ జిహాద్‌ను ప్రోత్సహించే విధంగా ఈ సీన్లు ఉన్నాయని గౌరవ్ తివారీ ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్ లోని నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రాత్మక పట్టణం మహేశ్వర్ ఆలయం లోపల ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమిది అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ప్రఖ్యాత చిత్రనిర్మాత మీరా నాయర్ ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలైన సలాం బాంబే..మాన్ సూన్ వెడ్డింగ్ .. ది నేమ్సేక్ లతో సంచలనాల దర్వకురాలిగా పాపులరయ్యారు.