అన్నపూర్ణ ఫొటో స్టూడియో…హిట్ అవుతుందని ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా – మాస్ కా దాస్ విశ్వక్ సేన్

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  మస్ కా దాస్ విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి, సింగర్ రఘు కుంచె, రచయిత లక్ష్మీభూపాల కార్యక్రమంలో పాల్గొని సినిమా టీమ్ కు విశెస్ తెలియజేశారు. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించారు.  “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో

సినిమాటోగ్రాఫర్ పంకజ్ మాట్లాడుతూ – చెందు గారు ఈ సినిమా కోసం పిలిచి మాట్లాడినప్పుడు కథ గురించి చెప్పలేదు. ఓకే అనుకున్నా..స్టోరి రెట్రో స్టైల్ లో ఉంటుందని  చెప్పారు. మా సినిమాటోగ్రాఫర్స్ కు రెట్రో స్టైల్ లో సినిమా చేయాలనే కోరిక ఉంటుంది. అది నాకు నా ఫస్ట్ మూవీతోనే రావడం సంతోషంగా ఉంది. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. లొకేషన్స్ ఆకర్షణ అవుతాయి. అన్నారు

నటి ఉత్తర మాట్లాడుతూ – నేను ఈ సినిమాలో  పద్దు అనే క్యారెక్టర్ చేస్తున్నాను. హీరోకు సిస్టర్  పాత్ర నాది. చాలా అల్లరిగా అన్నయ్యతో సరదాగా ఉండే క్యారెక్టర్ చేశాను. మా లాంటి యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాత యష్ గారికి థ్యాంక్స్. అని చెప్పింది.

నటుడు వైవా రాఘవ మాట్లాడుతూ – అన్నపూర్ణ ఫొటో స్టూడియో  ఒక అర్గానిక్ అండ్ ప్యూర్ మూవీ. సెట్ లో సినిమాలు జరుగుతుంటాయి. కానీ మా దర్శకుడు చెందు రియల్ లొకేషన్స్ లో మూవీ చేశారు. యూనిక్ కాన్సెప్ట్ తో సినిమా ఆకట్టుకుంటుంది. అన్నారు.

నటుడు లలిత్ ఆదిత్య మాట్లాడుతూ – ఇంతకముందు షార్ట్ ఫిలింలో నటించాను. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అన్ని ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. మా చిత్రాన్ని హిట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు

గాయకుడు, నటుడు రఘు కుంచె మాట్లాడుతూ – అన్నపూర్ణ ఫొటో స్టూడియో కంటెంట్ బాగుంది. పెళ్లి చూపులు సినిమా చూసినప్పుడు యష్ గారు, రాజ్ కందుకూరి గారు కలిసి యష్ రాజ్ ఫిలింస్ లా సినిమాలు చేయాలని చెప్పాను. ఈ సినిమాలో ఇటాలియన్ యాక్టర్ లా కనిపించారు యష్ గారు. ఆయన క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

రచయిత లక్ష్మీ భూపాల మాట్లాడుతూ – అన్నపూర్ణ ఫొటో స్టూడియో పేరు చూస్తే అప్పట్లో వంశీ గారు చేసిన శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ టైటిల్ గుర్తొచ్చింది. అదే స్టైల్ లో కోనసీమ నేపథ్యంతో సినిమా చేశాడు దర్శకుడు చెందు. ఆ నేపథ్యం, రెట్రో స్టైల్ చూస్తే రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఈ సినిమా చూశాను. బాగా నవ్వుకుని ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఆ ఫీల్  మిస్ కావొద్దు. అన్నారు.

హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ – విశ్వక్ గారి ఫలక్ నుమా దాస్ సినిమాలో నేను ఓ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ఆయన మా సినిమా ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ మీకు బాగా నచ్చాయని తెలుసు. మా ప్రొడ్యూసర్ యష్ గారు సినిమా కోసం చాలా రిస్క్ చేశారు. ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్ లో వచ్చిన రెస్పాన్స్ మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఒక అందమైన సినిమాగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అని చెప్పింది.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – అన్నపూర్ణ ఫొటో స్టూడియో ఇచట అందంగా సినిమాలు  తీయబడును అని పెట్టాల్సింది. ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ ఫిలిం. రెట్రో బ్యాక్ డ్రాప్, కెమెరా పనితనం, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. దర్శకుడు చెందూ ఓ పిట్ట కథను ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించాడో…ఈ సినిమాను అంతకంటే బాగా తెరకెక్కించాడు. హీరో చైతన్య, హీరోయిన్స్ లావణ్య, మిహిర,ఉత్తర అందరూ స్క్రీన్ మీద ఆకట్టుకునేలా ఉన్నారు. యష్ గారితో కలిసి త్వరలో ఓ సినిమా చేస్తాను. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా ప్రారంభించిన రోజే చెప్పాను ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఇప్పుడూ అదే నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత యష్ గారికి, దర్శకుడు  చెందు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. విశ్వక్ గారికి చిన్న సినిమాల ఇబ్బంది తెలుసు. అందుకే ఆయన వచ్చి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మా సినిమా చూస్తున్నంత సేపు మీ లైఫ్ లోని మెమొరీస్ గుర్తొస్తాయి. ఎక్కడా అసభ్యత ఉండదు. క్లీన్ యు సర్టిఫికెట్ సెన్సార్ నుంచి వచ్చింది. రెండు గంటలు ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది.  అన్నారు.

హీరో చెందు ముద్దు మాట్లాడుతూ – మేం కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. ఈ సినిమా వెనక మా రెండేళ్ల శ్రమ ఉంది. యష్ గారు సాధ్యమైనంతగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. చిన్న వాళ్ల దగ్గర నుంచి  పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. ఈ సినిమా చూసిన ఫీల్ కొన్ని నెలలపాటు మీతో ఉంటుంది. థియేటర్ కు వచ్చి చూడండి. అన్నారు.

నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ – మా అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా ప్రీమియర్స్ అన్ని ప్రాంతాల్లో వేశాం. మీడియాకు కూడా చూపించాం. ఒక సినిమా మీద ఇంతకంటే ఎవరికి నమ్మకం ఉంటుంది. బడ్జెట్ వైజ్ ఇది చిన్న చిత్రమే కావొచ్చు కానీ ప్రేక్షకులకు నచ్చితే బిగ్ ఫిలిం అవుతుంది. పెళ్లి చూపులు విషయంలో మాకు అదే ఎక్సీపిరియన్స్. చిన్న సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ తీసుకొచ్చింది. ఇండస్ట్రీకి విజయ్ లాంటి స్టార్ ను ఇచ్చింది. ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. మా సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ థాంక్స్. వాళ్లు ఏడాది పాటు కష్టపడ్డారు. ఇక్కటికి గెస్ట్ లుగా వచ్చిన విశ్వక్, రఘు, చైతన్య, లక్ష్మీ భూపాలకు థాంక్స్. అని అన్నారు.

డైరెక్టర్, రైటర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూృ – చెందు గారి సినిమాలంటే నాకు ఇష్టం. యష్ గారికి ప్రొడ్యూసర్ గా మంచి టేస్ట్ ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – ఏ సినిమాను చిన్న సినిమా అనొద్దు. కొత్త వాళ్ల సినిమా అని పిలవండి. నేను రావడం వల్ల సినిమాకు మంచి జరిగితే తప్పకుండా ప్రమోషన్ కు వస్తాను. అది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్ నచ్చింది. ఈ సినిమా మీరు ఆశించిన సక్సెస్ అందుకుంటుంది. హీరో చైతన్య ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. తరుణ్ భాస్కర్ కీలా కోడాలో నటిస్తున్నాడు. దర్శకుడు చెందు టాలెంటెడ్ పర్సన్. ఒక ఫ్యామిలీలా ఈ సినిమా కోసం టీమ్ అంతా కష్టపడ్డారు. నిర్మాత యష్ గారు సినిమా కోసం డెడికేషన్ తో ఉంటారు. వీళ్లందరికీ  మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా.