Vakeelsaab: అంజ‌లి అందానికి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే..

Vakeelsaab: అంజ‌లి అంటే ఇప్పుడు అంద‌రికీ గుర్తొచ్చేది ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ వ‌కీల్ సాబ్ క్లైయింట్స్‌లో ఒక‌ర‌ని. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలుకు చెందిన ఈ అమ్మడు మొద‌ట షాపింగ్ మాల్ చిత్రాల్లో న‌టించి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. అలాగే జ‌ర్నీ చిత్రంతో మ‌రింత గుర్తింపు సంపాదించుకుంది. ఆమె న్యాచు‌ర‌ల్ అందంతో కుర్ర‌కారును క‌ట్టి ప‌డేసేది. ఇక విక్ట‌రీ వెంక‌టేష్‌కు జోడీగా సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లే చెట్టులో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. దీంట్లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు కూడా న‌టించారు.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న విజ‌యం సాధించింది. ఇక అనంత‌రం ఈ అమ్మ‌డికి కొంత కాలం తెలుగులో స‌రైనా అవ‌కాశాలు రాలేదు..

ఈ క్ర‌మంలో ప‌వ‌ర్‌స్టార్‌తో స్ర్కీన్ షేర్ చేసుకునే అవకాశం వ‌చ్చింది. ఈ చిత్రంలో ఎమోష‌న‌ల్ ర‌గిలించే పాత్ర‌తో ఆమె క‌ట్టిప‌డేయ‌నుంది. ఇక నిన్న జ‌రిగిన వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుక‌ల్లో అంజ‌లి అంద‌చందాలు ఫిదా చేశాయి.. ప‌సుపు క‌ల‌ర్ చీర‌లో.. బూడిద క‌ల‌ర్‌లో ఉన్న బ్లౌజ్ లో త‌న ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ ఈ అమ్మ‌డు వేడుకల్లో హ‌ల్చ‌ల్ చేసింది. మరీ ఆ ఫోటోల‌ను మీరే చూడండి.