అంజలి ప్రధాన పాత్రలో ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్

యాబైకి పైగా చిత్రాల్లో ఎన్నో హీరోయిన్‌గా, ప్రధాన పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆదివారం అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బహిష్కరణ’ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. అంజలి చేతిలో వేట కొడవలి పట్టుకుని కోపంగా కూర్చుంది.. ఆమె పక్కన్న ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోతుంది. మరోసారి అంజలి మరో విలక్షణమైన పాత్రలో ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌తో ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌లో మెప్పించనుందని తెలుస్తోంది.

ఫిక్సల్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తోన్న ‘బహిష్కరణ’ సిరీస్ త్వరలోనే ZEE 5 ద్వారా ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. భార‌త‌దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మం ZEE 5. ప‌లు భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు అప‌రిమిత‌మైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్ర‌మంలో ‘బహిష్కరణ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను త్వరలోనే అలరించనుంది.

నటీనటులు:

అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర తదితరులు

సాంకేతిక వర్గం:

నిర్మాణ సంస్థ: ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా

నిర్మాత: ప్రశాంతి మలిశెట్టి

రైటర్ – డైరెక్టర్ : ముఖేష్ ప్రజాపతి

డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: ప్రసన్న కుమార్

సంగీతం : సిద్ధార్ద్ సదాశివుని

ఎడిటర్ : రవితేజ గిరిజాల

కాస్ట్యూమ్ డిజైనర్ : అనూష పుంజాల

ఆర్ట్ డైరెక్టర్ : ప్రియం క్రాంతి

కో – రైటర్ : వంశీ కృష్ణ పొడపటి

డైలాగ్ రైటర్ : శ్యామ్ చెన్ను

కో- డైరెక్టర్ : రమేష్ బోనం

అసోసియేట్ డైరెక్టర్: ఆదిత్య ఆకురాతి

పి.ఆర్.ఒ: బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).