రామారావుగారు వచ్చేది అప్పుడేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకి సరిలేరు నీకెవరు లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. 2019, 2020 సంక్రాంతి పండగలకు హిట్స్ ఇచ్చిన అనీల్, ప్రస్తుతం ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఎఫ్3 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మరింత పెంచుతూ తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ వెంకటేష్ లతో పాటు రవితేజ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకోని కరోనా కారణంగా సెట్స్ పైకి వెళ్లని ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తర్వాతి చిత్రంపై ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. అనిల్ తన తరువాత సినిమాని నటసింహం బాలకృష్ణతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అనిల్ ఇప్పటికే బాలయ్యతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. బాలయ్య బోయపాటి సినిమా అయ్యాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివర్లో అనీల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రామారావుగారు అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.