తనకు కరోనా సోకలేదంటున్న బాలీవుడ్ సీనియర్ హీరో

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న జగ్ జగ్ జీయో సినిమా షూటింగ్ ఇటీవల ఛండీగడ్‌లో ప్రారంభం అయింది. అయితే హీరో వరుణ్ ధావన్, డైరెక్టర్ రాజ్ మోహత, నీతూ కపూర్‌లకు కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు సీనియర్ హీరో అనీల్ కపూర్‌కు కూడా కరోనా సోకినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అనిల్ కపూర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ANIL KAPOOR

ఈ క్రమంలో తనకు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలపై అనీల్ కపూర్ స్పందించాడు. తనకు కరోనా సోకలేదని, టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని చెప్పాడు. ఈ మేరకు టెస్ట్ రిపోర్టును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ రిపోర్ట్‌లో అనిల్ కపూర్‌కు నెగిటివ్ అని రాసి ఉంది. నెగిటివ్ వచ్చినా సరే నిబంధనల ప్రకారం అనిల్ కపూర్ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.

మరోవైపు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న హీరోయిన్ కియారా అద్వానీకి కూడా కరోనా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కరోనా రాలేదని తెలుస్తోంది. హీరో, డైరెక్టర్‌, నీతా కపూర్‌కు మాత్రమే కరోనా సోకిటన్లు సమాచారం. అయితే వారికి కూడా పెద్దగా కరోనా లక్షణాలు లేవని సమాచారం.