ఆంధ్ర ప్రదేశ్ లో కల్కి టికెట్ రేట్ల పెంపు – దీనికి ముఖ్య కారణం ఎవరు అంటే…

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కల్కి 2898AD. నాగ అశ్విన్ దర్శకత్వలో వస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా జోర్డ్జ్ స్టోజిల్జ్కోవిక్ సినెమాటోగ్రఫేర్గా చేస్తున్నారు. ఈ చిత్తంలో అమితాబ్ బచ్చన్, దీపికా పాడుకొనే, కమల్ హస్సన్, దిశా పాటని, బ్రహ్మానందం వంటి నటీనటులు ప్రముఖ పాత్రలలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే రోజు రోజుకు ఈ సినిమాలో నటించిన అగ్ర నటులు ఒకొకరిగా బయట పడుతూ ప్రేక్షకులను ఆశ్చర్పరుస్తాన్నారు. ఈ సినిమాలో దుల్కర్ సలీమాన్, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు అనే వార్తలు మెండుగా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా కల్కి మూవీ టీం విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ లో శోభన, మాళవిక నాయర్ కూడా కనిపించడం జరిగింది.

కల్కి సినిమాకు సుమారు 600 కోట్లు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఉన్న టికెట్ రేట్లతో అంత బడ్జెట్ ను రాబట్టుకోవడం కష్టం అనే చెప్పుకోవాలి. కాబట్టి కల్కి సినిమా కలెక్షన్లు రావాలంటే కచ్చితంగా సినిమా టికెట్ రేట్లు పెంచాల్సిందే. అయితే నిన్న తెలుగు సినీ నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారిని కలవడం జరిగింది. కొన్ని గంటల చర్చల తరువాత ఈ సమావేశం ముగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో సినిమా టికెట్ రేట్లు, సినిమా వారి కష్టాలు, థియేటర్ పర్మిషన్ల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తుంది.

చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లో కల్కి సినిమా రేట్లు పెంచుకోవడానికి అనుమతించింది. ఈ నెల 27న విడుదల కానున్న కల్కి సినిమాకు 14 రోజుల పాటు అదనపు షోతో కలిపి రోజుకు 5 షోలు, అలాగే ఆ 5 రోజులు టికెట్ రేట్ల పెంపుకు అనుమతించింది. ఈ నెల 27 నుండి జుల్ట్ 10వ తేదీ వరుకు సాధారణ థియేటర్లలో 75/- అలాగే ముల్టీప్లెక్లలో 125/- టికెట్ ధర పెంపుకు అనుమతించిండం జరిగింది. దీనిని అమలు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ జీవోను జారీచేసింది.