అనసూయకు ఆ తమిళ స్టార్ హీరో అంత క్లోజా?

జబర్దస్త్ షోలో పొట్టి పొట్టి దుస్తులతో హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రోళ్లను పడగొట్టింది హాట్ యాంకర్ అనసూయ. ఆ షోతో పాపులర్ అయిన ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కూడా వచ్చేశాయి. ఇప్పటికే పలు సినిమాల్లో నటించగా.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్‌తో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. రాంచరణ్‌తో కలిసి నటించి తన సత్తా ఏంటో చూపించింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు ఆఫర్స్ మరింతగా పెరిగాయి. ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తూ ఒకవైపు యాంకర్‌గా.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా పడుతోంది.

vijay setupati

అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిలో అనసూయ క్లోజ్‌గా ఉన్న ఫొటో బయటికొచ్చింది. ఇందులో విజయ్ సేతుపతి భుజం మీద అనసూయ చేయివేసి నవ్వుతూ ఉంది. ఈ ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అనసూయ.. ”బ్రిలియన్స్ తో బాండింగ్.. నిజంగా మక్కల్ సెల్వన్” అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు.. అనసూయకు విజయ్ సేతుపతి అంత క్లోజ్ ఎప్పుడు అయిందని కామెంట్ చేస్తున్నారు.

దీనిని చూసిన నెటిజన్లు విజయ్ సేతుపతితో అనసూయ ఏదైనా సినిమా చేయనుందా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం థ్యాంక్ యూ బ్రదర్ సినిమాలో అనసూయ నటిస్తోంది. ఇందులో గర్భవతిగా అనసూయ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. త్వరలో విడుదలయ్యే అవకాశముంది.