మరో ఐటెం సాంగ్‌తో అనసూయ?

ఒకవైపు బుల్లితెరతో పాటు మరోవైపు పెద్ద స్క్రీన్ పెద్ద అనసూయ సత్తా చాటుతోంది. జబర్దస్త్ షోతో పేరు తెచ్చుకున్న అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో పలు పాత్రలలో నటించింది. రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న అనసూయకు.. ఆ తర్వాత వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాతో అనసూయ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

anasuya item song

ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌లో గర్బిణి పాత్రలో అనసూయ కనిపించింది. గర్భిణులు పడే ఇబ్బందులను ఈ సినిమాలో చూపించనున్నారు. అయితే తాజాగా ఒక సినిమాలో ఐటెం సాంగ్‌ చేసేందుకు అనసూయ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో వస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఈ ముద్దుగుమ్మ ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.