కోలీవుడ్‌లోని అనసూయ ఎంట్రీ

జబర్తస్త్ హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు కోలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రంగమార్తండ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమాలో కూడా నటిస్తోంది. ఇటీవల పుష్ప సినిమాలో కూడా అనసూయ నటించనుందనే వార్తలొచ్చాయి. పుష్ప సినిమాలో ఒక పాత్ర కోసం అనసూయను సుకుమార్ సంప్రదించాడట. దీంతో పుష్పలో నటించేందుకు అనూసూయ ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ANASUYA

అయితే తాజాగా కోలీవుడ్‌లో ఒక సినిమా చేసేందుకు అనసూయ ఒప్పుకుంది. అంతేకాదు ఆ సినిమా లుక్‌ను కూడా రివీల్ చేసింది. విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ చాలా బోల్డ్‌గా కనిపించనుందట. సిల్క్ స్మిత పాత్ర తరహాలో అనసూయ పాత్ర ఉంటుందని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాలో అనసూయ పాత్ర హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

ఇది అనసూయకు ఒక ఛాలెజింగ్ రోల్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను అనసూయ ఆకట్టుకుంటే.. ఆమెకు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని చెప్పవచ్చు.